02-08-2025 08:08:50 PM
డ్రా చేసిన డబ్బులతో ఆన్లైన్ గేమ్ లలో పెట్టుబడి పెడుతు జల్సాలకు పాల్పడుతూన్న వ్యక్తి అరెస్ట్..
సుమారుగా ఐదు లక్షల రూపాయల మోసం..
విజయవాడలో పట్టుకున్న జిల్లా సైబర్ క్రైమ్ టీమ్..
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే(SP Mahesh B. Gite) మాట్లాడుతూ.. వెస్ట్ బెంగాల్ కు చెందిన హరి బర్మన్ అనే వ్యక్తి ఇంటర్ వరకు చదువుకొని దురాలవాట్లకు అలవాటు పడి ట్రైన్ లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి గుంతకల్, గూటి ఏరియాలో మొబైల్స్ దొంగిలించి అట్టి మొబైల్స్ పాస్వర్డ్ మార్చి మొబైల్ ఫోన్ లో గల ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ల సహాయంతో ఫోన్ పే, గూగుల్ పే లా పాస్వర్డ్స్ రీసెట్ చేసి డబ్బులు వేరే అకౌంట్ కి పంపించుకోని జల్సాలకు వినియెగించుకునేవాడు.
అందులో భాగంగా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాస్ అనే వ్యక్తి తేదీ 12.03.2025 రోజున తిరుపతి కి రైలులో వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి చూసేసరికి అతని భార్య ఫోన్ ఎవరో గుర్తుతెలియని వ్యక్తి దొంగలించి ఆ ఫోన్లో ఉన్న ఫోన్ పే ద్వారా పలు దాఫాలుగా తన అకౌంట్లో ని డబ్బులను ఫోన్ పే ద్వారా ఐదు లక్షల 12 వేల రూపాయలు ట్రాన్సక్షన్ జరుగగా శ్రీనివాస్ అనే వ్యక్తి అట్టి బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా రుద్రంగి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఎస్.ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణలో భాగంగా చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు జిల్లా సైబర్ క్రైమ్ ఆర్.ఎస్.ఐ జునైద్ కానిస్టేబుల్ కిట్టు, మహేష్, గంగి రెడ్డి, రాజు ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నింధితుడు హరిని విజయవాడలో అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, సైబర్ ఆర్.ఎస్.ఐ జునైద్, కనిస్టేబుళ్ళు కిట్టు, రాజు, గంగిరెడ్డి, మహేష్ ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.