02-08-2025 07:46:03 PM
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొండా శ్రీను..
చిలుకూరు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వాటిని ఖండిస్తున్నామని, బీజేపీ చిలుకూరు మండల ప్రధాన కార్యదర్శి కొండ శ్రీను(Mandal Chief Secretary Konda Srinu) అన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, బీసీలకు 42 శాతం, రిజర్వేషన్ను అమలు చేస్తామని దానికోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని గొప్పలు చెప్తున్నారే తప్ప ఆచరణలో చేసి చూపడం లేదని, నిజంగానే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42 శాతం, రిజర్వేషన్ బీసీలకే కల్పించాలని, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల బీసీలకు దక్కేది 32 శాతమేనని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బిల్లులో సరైన ప్రక్రియను చేపట్టే వారే తప్ప ఆర్డినెన్స్ తీసుకురాక పోయేవారు కాదని అన్నారు. బీసీలకు 42 శాతం, రిజర్వేషన్లు కల్పించాలని అంశంపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుకు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.