02-08-2025 07:49:05 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ (ఈవీ), ఎలక్ట్రానిక్స్ (ఈఎంబి) బ్రాంచీలలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలియజేశారు. స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఈ నెల 6 నుండి 8 వరకు స్వీకరిస్తామని, 8న ఉదయం 11.00 గంటలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని చెప్పారు. వివరాల కొరకు ప్రిన్సిపాల్ 8977222648, నర్సయ్య 9848664703, సురేష్ 9989173035 నెంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.