02-08-2025 07:51:47 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): నగరంలోని అల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్ పాఠశాల(Alphores Planet Kids School)లో శనివారం ఫారెస్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, పలు రకాల ఫలాలను వనరులను కల్పించేది అడవులేనని, అడవుల వలన నీటి సంరక్షణ జరుగుతుందని, ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన వాయు కాలుష్యం నుండి రక్షిస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, శ్రద్ద వహించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి పలు కార్యక్రమాలు ముఖ్యంగా అడవి రాజులు, అడవి చేస్తుంది జీవితం నాటికలు చాలా ఆకట్టుకున్నాయన్నారు. ఆలపించిన పలు వృక్షాల గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.