calender_icon.png 2 August, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహణ

02-08-2025 07:55:54 PM

ఆగస్టు 01 నుండి 07 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు..

బిడ్డ ఆరోగ్య భవిష్యత్తుకు పునాది తల్లి పాలు..

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల కోసం కొనసాగుతున్న సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) తెలిపారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఆగష్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

పుట్టిన గంట లోపు ముర్రు పాలు పట్టడం వలన కలిగే లాభాలు, సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు. తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమైనవని, వీటిలో అనేక పోషకాలతో పాటు విటమిన్లు ఉంటాయన్నారు. వీటివల్ల బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి సంక్రమిస్తుందన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే మొట్టమొదట వచ్చే ముర్రుపాలను బిడ్డ పుట్టిన మొదటి గంట లోపల తాగించాలన్నారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలను మాత్రమే ఇవ్వాలన్నారు.ప్రస్తుత సమాజంలో చాలామంది తల్లులు అపోహల వల్ల 65 శాతం తల్లులు మాత్రమే బిడ్డకు తల్లిపాలు ఇస్తున్నారని, అందుకే ప్రస్తుతం మన సమాజంలో అనేకమంది పిల్లలు బలహీనంగా పుట్టడం జరుగుతుందన్నారు.

భవిష్యత్తులో బిడ్డ ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటే ప్రతి తల్లి తమ బిడ్డకు పుట్టిన గంటలో పాలు తాగించి ఆ తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీద పెంచాలని  తెలిపారు. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరేష్, శిశు సంక్షేమ అధికారిని వాణిశ్రీ, సూపర్వైజర్లు పవిత్ర, ఆండాలు, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధు, ఎఫ్ ఆర్ ఓ కొండయ్య పాల్గొన్నారు.