calender_icon.png 24 August, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యంతో మామిడి రైతులకు నష్టం

15-05-2025 02:16:25 AM

మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల అర్బన్, మే 14 (విజయక్రాంతి): మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే మామిడి మార్కెట్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నందున   25 ఎకరాల స్థలం  కేటాయించి మామిడి మార్కెట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

స్థానిక రైతులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా మామిడి మార్కెట్, రైతులకు, కూలీల కోసం ఏర్పాటు చేశామన్నారు. మామిడి మార్కెట్ లో వేలం నిర్వహిస్తే మామిడి రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్కు విన్నవిస్తే కలెక్టర్ మామిడి మార్కెట్ సందర్శించి, ఆదేశాలు జారీ చేశారన్నారు. మార్కెట్లో కామన్ ప్లేస్లో మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో వేలం నిర్వహించాల్సి ఉన్నా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు.

మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లిప్తతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మార్కెటింగ్ ఫీజు 4 ఉంటే, 10 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇదేమిని అధికారులను అడిగితే మాకు ఎవరూ ఫిర్యాదు చేయడం లేదంటున్నారని తెలిపారు. మామిడిలో నాణ్యత ప్రమాణాల కోసం గ్రేడింగ్ పేరిట మరో 10 శాతం వసూలు చేస్తున్నారని, మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించాల్సిన వేలం  ట్రేడర్లు వారి దుకాణాల ఎదుటనే వేలం నిర్వహిస్తున్నారన్నారు.

జిల్లా కలెక్టర్ మామిడి మార్కెట్ను సందర్శించిన తర్వాత కూడా మార్కెట్లో అవకతవకలు అరికట్టకపోతే ఎలా అని మండిపడ్డారు. మామిడి మార్కెట్లో అవకతవకలు అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో  కామన్ ప్లేస్లో వేలం నిర్వహించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి పారద ర్శక పాలన అందిస్తున్నారని, అధికారులు నిత్యం సమీక్షలు చేస్తున్నా మార్కెటింగ్ శాఖలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు.

మామిడి మార్కెట్ లో అవకతవకలకు జిల్లా మార్కెట్ శాఖ అధికారి, మార్కెట్ శాఖ కార్యదర్శులే  బాధ్యత వహించాలన్నారు. మామిడి మార్కెట్ ను పర్యవేక్షించేలా ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించి మామిడి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు కళ్లేపల్లి దుర్గయ్య, బండ శంకర్, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, రమేష్ రావు, షేక్ చాంద్ పాషా, ధరా రమేష్ బాబు, మాజీ ఎంపీపీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.