15-05-2025 02:14:50 AM
సిరిసిల్ల, మే14(విజయక్రాంతి): రైతులకు మేలైన సాగు పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం & బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల జిల్లెల్ల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారితో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని బుధవారం ఇల్లంతకుంట మండలములోని పెద్ద లింగాపూర్ గ్రామంలో గల రైతువేదిక నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, జిల్లెల్ల వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అలాగే ముఖ్య అతిధి గా వచ్చిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు యాజమాన్య పద్ధతులు, కూరగాయలు పూల సాగు సబ్సిడీ వివరాలు గురించి వివరించడం జరిగింది.
రైతులందరూ యూరియా వాడకాన్ని తగ్గించి మరియు సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను వాడి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. అలాగే రాబోవు నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఉద్యాన అధికారిని లత బాబు జగ్జీవన్ రామ్ వ్యవ సాయ కళాశాల, జిల్లెల్ల , అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాధవి, అరుణ్ బాబు,మండల వ్యవ సాయ అధికారి సురేష్, ఉద్యాన శాఖ అధికారి గోవర్ధన్, వ్యవసాయ విస్తరణ అధికారులు జ్యోతి, అర్చన, రవళి,కె. అర్చన, లలిత, గంగ,అభిషేక్ మరియు ఉత్తమ రైతులు పాల్గొన్నారు.