హద్దుమీరుతున్నారు
వైభవ్, జైస్వాల్ తీరుపై మంజ్రేకర్ విమర్శలు
కొలంబో, ఆగస్టు 26: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రవర్తనపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Former cricketer Sanjay Manjrekar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించే యువ ఆటగాళ్లను వదిలిపెట్టకూడదని.. ఐసీసీ, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.
ఇలాంటి ప్రవర్తనను పట్టించుకోకుండా వదిలేస్తే.. భవిష్యత్తులోనూ అదే తప్పును పునరావృతం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. భారత్- ఏ తరఫున ఆడేటప్పుడు వైభవ్ సూర్యవంశీ, ఇటీవల యశస్వి జైస్వా ల్ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ప్రవర్తన ఏ.మాత్రం సరికాదని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. కాగా గత జూన్లో శ్రీలంక-ఏతో భారత్-ఏ జట్లు ట్రై సిరీస్ ఆడింది. వైభవ్ సూర్యవంశీ ఔటైన తర్వాత.. డకౌట్ను వెళ్తుంటే శ్రీలంక ప్లేయర్ విషేన్ హలమ్ ఏవో వ్యాఖ్యలు చేశాడు.
దీంతో ఆగ్రహానికి గురైన వైభవ్.. వెనక్కి వచ్చి ధీటుగా బదులిచ్చాడు. అయితే వైభవ్‌తో పాటు లంక ప్లేయర్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్టులో, లంక బౌలర్ అసిత ఫెర్నాండో ఔట్ చేసిన తర్వాత జైస్వాల్ను దూషించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి ఐసీసీ ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ, ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.






