17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా మంజుల ధర్మ, వైస్‌చైర్మన్‌గా పైపాడు సారంద

17-02-2026 12:12 AM

అలంపూర్, ఫిబ్రవరి 16: వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది.మొత్తం 10 వార్డులలో ఏకంగా ఎనిమిది వార్డుల్లో ఫార్వర్డ్ బ్లా క్ కౌన్సిలర్లు గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించారు. దీంతో చైర్మన్ ఈ దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సునాయాసంగా ద క్కించుకుంది. ముందుగా కౌన్సిలర్లంతా 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఏఐఎఫ్ బి తరపున నాలుగవ వార్డులో  గెలిచిన  మంజుల ధర్మ చైర్మన్ గా, అదే పార్టీ తరపున రెండవ వార్డులో గెలిచిన పైపాడు సారందను మిగతా కౌన్సిలర్లంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమీషనర్ రాజయ్య చైర్మన్ గా మంజుల ధర్మ, వైస్ ఛైర్మన్ గా పైపాడు సారంద చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం చై ర్మన్ మంజుల ధర్మ మాట్లాడుతూ.. ఏఐ ఎ ఫ్ బి ముఖ్య నేత సీనియర్ నాయకులు వడ్డేపల్లి శీనన్న నేతృత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. వడ్డేపల్లి పట్టణమంతా సింహం జెండాలను చేత పట్టి  బాణసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున నాయకులు సంబరాలు చేసుకున్నారు.