calender_icon.png 18 February, 2026 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు జోరు.. హస్తం హుషారు

17-02-2026 12:12:05 AM

  1. ఉమ్మడి జిల్లాలో 9 కాంగ్రెస్, 8 బీఆర్‌ఎస్ చైర్మన్ పీఠాలు కైవసం

జహీరాబాద్, ఇంద్రేశం ఎంపిక వాయిదా 

నేడు తేలనున్న ఫలితాలు 

నర్సాపూర్, జిన్నారంలో బీజేపీకి వైస్ చైర్మన్ పదవులు

ఇస్నాపూర్లో బీఆర్‌ఎస్ను గట్టెక్కించిన మెదక్ బీజేపీ ఎంపీ 

సంగారెడ్డి, ఫిబ్రవరి 16(విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలలో కొన్నిచోట్ల కాంగ్రెస్ చక్రం తిప్పగా మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే బీఆర్‌ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపు కున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 ము న్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ ఆరు స్థానా లు, బీఆర్‌ఎస్ ఆరు మున్సిపాలిటీలను పూర్తి మెజార్టీతో కైవసం చేసుకున్నాయి.

మిగతా ఏడు మున్సిపాలిటీలైన జహీరాబాద్, కోహీ ర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, నర్సాపూర్, మెదక్ లో హంగ్ ఏర్పడింది. దీంతో ఈ మున్సిపాలిటీలలో స్వతంత్రులు, బీజేపీ, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు కీలకంగా మా రారు. ఫలితాలు వెలువడిన రోజునుండే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపి రహస్య శిబిరాలకు మద్దతుదారులను తరలించారు. సోమవారం నిర్వహించి న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కేంద్రాల వద్దకు నేరుగా ఆయా పార్టీలు ప్రత్యేక బస్సు ల్లో కౌన్సిలర్లను తీసుకువచ్చారు.

జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీలో కోరం లేక మంగళవారానికి వాయిదా వేశారు. మొ త్తంగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ 9, బీఆర్‌ఎస్ 8 మున్సిపాలిటీలను గెలుపొందాయి. వాయిదా పడ్డ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరొకటి గెలుపొందే అవకాశం ఉంది. 

సంగారెడ్డి జిల్లాలో ఇలా...

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలలో సంగారెడ్డి, సదాశివపేట, ఆందో ల్-జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించి కైవ సం చేసుకోగా, గడ్డపోతారం, గుమ్మడిదలలో బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మిగతా ఐదు మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కార్యక్రమం చేపట్టగా రాజకీయ ట్విస్టులు బ యటపడ్డాయి.

జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 6 కాంగ్రెస్, 8 బీఆర్‌ఎస్ గెలుపొందగా, బీజేపీ 4, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కోసం ఇక్కడ బీజేపీ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్కు మద్దతునివ్వడంతో చైర్మన్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. మద్దతునిచ్చినందుకు బీజేపీకి వైస్ చైర్మన్ పదవి అప్ప గించారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 10 కాంగ్రెస్, 12 బీఆర్‌ఎస్ గెలుపొందగా స్వతంత్రులు నలుగురు గెలిచారు.

స్వతంత్రుల నుండి కాంగ్రెస్ ముగ్గురితో పాటు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ను కాంగ్రెస్లో చేర్పించుకోగా బీఆర్‌ఎస్ ఒకరిని చేర్చుకుంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు ఉండడంతో చెరి సమానం అయ్యాయి. ఈ స్థానంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకపోయినా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఎక్స్ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకోవడం బీఆర్‌ఎస్కు కలిసొచ్చింది.

జిన్నారంలో బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చినందుకు ఎంపీ ఓటు బీఆర్‌ఎస్కు వేయడంతో ఇస్నాపూర్ చైర్మన్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలో పడింది. అయితే ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 6 కాంగ్రెస్, బీఆర్‌ఎస్కు 9 స్థానాలు గెలుపొందగా, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకటి గెలవడంతో ఈ స్థానం కూడా బీఆర్‌ఎస్కే దక్కుతుందని భావించారు. కానీ కాం గ్రెస్ కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో కో రం లేక ఈనెల 17న వాయిదా వేశారు.

అలాగే జహీరాబాద్ మున్సిపాలిటీలో సైతం 37 వార్డులకు గాను 14 కాంగ్రెస్, 15 బీఆర్‌ఎస్ గెలుపొందగా 3 బీజేపీ, 2 ఎంఐఎం, 3 ఇతరులు గెలుపొందారు. దీంతో కాంగ్రెస్కు ఎంఐఎం, స్వతంత్రులు మద్దునిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్రులు ప్రమాణ స్వీకారానికి రాలేదు. దీంతో కోరం లేక ఇక్కడ కూడా మంగళవారానికి ఎన్నిక వాయిదా వేశారు.