07-10-2025 12:00:00 AM
డా.బి.అనురాధ సహకారంతో
దౌల్తాబాద్, అక్టోబర్ 6 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన జోడు రాకేష్ కుమారుడు మనో హర్ కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్ర మాదంలో కుడిచేయి కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.బి.అనురాధ స్పందించి సంబంధిత వైద్యులతో మాట్లాడి అవసరమైన ఖర్చులు భరించి ఆర్టిఫిషియల్ హ్యాండ్ అమర్చేలా సహాయం చేశారు. మనోహర్ కు చేయి లేని లోటును తీర్చిన కమిషనర్ ను రాకేష్ కు టుంబ సభ్యులు సోమవారం కలసి కృతజ్ఞతలు తెలిపారు.