calender_icon.png 7 October, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతల దిశగా తొలి అడుగు

07-10-2025 12:00:52 AM

సీపీ విజయ్ కుమార్

సిద్దిపేట,అక్టోబర్ 6 (విజయక్రాంతి):సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నియమకమైన యం. విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. హైమావతిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

హైద్రాబాద్ వెస్ట్ జోన్ డిసిపి గా పనిచేసి బదిలీపైన జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో శాంతి భద్రతలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గూర్చి కాసేపు చర్చించి స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్‌కుసూచించారు.