01-08-2025 06:08:51 PM
తుంగతుర్తిలో నాలుగు కుటుంబాలకు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు..
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..
తుంగతుర్తి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల కోసం ప్రజాపాలన కొనసాగుతున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తూర్పు బజారులో నివసిస్తున్న పేద కుటుంబాన్ని సందర్శించి, వారి కుటుంబాన్ని అక్కువ చేర్చుకొని, వారి కష్టాలను తెలుసుకొని తక్షణమే స్థానిక ఎంపీడీవోకు ఇల్లు మంజూరు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. పేద మహిళ కుటుంబీకులైన గాదంగి ఉమా, రేణుక, అనూష, మామిడి శ్రీనులకు ఇండ్లు మంజూరు కాగా, వారు చాలా సంతోషిస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపారు. కుటుంబీకులు వారి యొక్క దీన స్థితిని మొత్తం ఎమ్మెల్యేకు తెలియజేశారు.
అవకాశమున్నప్పుడు అన్ని విధాల ఆదుకుంటానని, ప్రజల చేత ఎన్నుకున్నాను ఎన్నికై ఎమ్మెల్యేగా మీ ముందుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అర్హులైన పేద కుటుంబీకుల మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లపై అవకతవకలు జరిగితే సహించేది లేదని అన్నారు. అనంతరం వెలుగు పెళ్లిలో ఎంజిఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా 12 లక్షల నిధులతో అంగన్వాడి భవనము, 20 లక్షలతో గ్రామపంచాయతీ కార్యాలయం నూతన బిల్డింగులకు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, దాసరి శ్రీను, సుంకరి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.