01-08-2025 05:38:30 PM
మున్సిపల్ కమిషనర్ గజానంద్..
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ గజానంద్(Municipal Commissioner Gajanand) అన్నారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా జనక్కాపూర్ వై.ఎస్.ఆర్ నగర్, ఆర్ఆర్ కాలనీతో పాటు పల్వార్డులలో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, వందరోజుల ప్రణాళికల భాగంగా మున్సిపల్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మున్సిపల్, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కూలర్లలో ఉన్న నీటిని తొలగించడం, దోమల నివారణ మందులను స్ప్రే చేయించడం, నీరు ఆగి ఉన్న ప్రదేశాలలో ఆయిల్స్ బాల్స్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆడా వైద్య అధికారి వినోద్ కుమార్ టీఎం.సీ అరుణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దబ్బెట రాజు, వార్డ్ ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.