01-08-2025 05:19:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూలర్ మండలంలోని అనంత పేట్ గ్రామంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ నాగలక్ష్మి(CDPO Nagalaxmi) ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ నిర్వహించి తల్లులకు గర్భిణులకు తల్లిపాల యొక్క ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు. వారం రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.