calender_icon.png 2 August, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

01-08-2025 05:49:12 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్(Khanapur Police Station) పరిధిలో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ప్రోగ్రాం నిర్వహించారు. కాగా కార్యక్రమంలో 45 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కార్, సరైన పత్రాలు లేకపోగా వాటిని స్వాధీనం చేసుకున్నామని సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కాలనీలో విధిగా సీసీటీవీ ఏర్పాట్లు చేసుకోవాలని, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ సర్కిల్లోని ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు.