01-08-2025 06:10:30 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): శ్రావణమాసం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ బునిలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ హోమం, కుంకుమార్చన పూజలు ఆలయ అర్చకులు వినయ్ మిశ్రా హేమంతాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని మహిళా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఓలం మురళి, ధర్మకర్తలు బచ్చు పరమేశ్వర్, కొయ్యగూర యాకూబ్ రెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.