01-08-2025 05:55:22 PM
వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ విద్యాశాఖ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్(Face Recognition Attendance) శుక్రవారం వలిగొండ మండలంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంఈఓ సుంకోజు భాస్కర్(MEO Sunkoju Bhaskar) మాట్లాడుతూ, తెలంగాణ విద్యాశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ శుక్రవారం పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని, దీని ద్వారా ఉపాధ్యాయులు నిర్ణీత సమయానికి పాఠశాలకు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. పాఠశాల సమయం దాటిన తర్వాత ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ద్వారా నమోదు చేసినట్లయితే ఆబ్సెంట్ చూపిస్తుందని అన్నారు. ఉపాధ్యాయుడు తప్పక పాఠశాలలో ఉండి యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకోవాలని అన్నారు.