calender_icon.png 2 August, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు

01-08-2025 06:00:45 PM

హన్మకొండ (విజయక్రాంతి): ప్రతి సంవత్సరం తల్లిపాల ప్రాముఖ్యతపై ఒకటి ఆగస్టు నుండి ఏడు ఆగస్టు వరకు నిర్వహించడం జరుగుతుంది. నేడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు(Medical Health Officer Dr. Sambasiva Rao) అధ్యక్షతన సికేఎం హాస్పిటల్ వరంగల్ నందు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వారి కుటుంబీకులు పాల్గొని ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ... తల్లిపాల వలన బిడ్డకు తల్లికి మధ్య అనుబంధం పెరుగును అని తెలిపారు. తల్లిపాలు బిడ్డ త్రాగడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగును. పోషకాలు గలిగిన ఆహారము అందును. జీర్ణశక్తి పెరుగును. అస్తమ ఊబకాయము రాకుండా ఉండును. మానసికంగా అభివృద్ధి చెంది చురుకుగా ఎదుగుదల ఉండును అని తెలిపారు. 

తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన బరువు తగ్గునని గర్భాశయము సాధారణ స్థితికి వచ్చునని క్యాన్సర్లు రాకుండా ఉంటాయని మానసిక ప్రశాంతత ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి బిడ్డ తన తల్లిపాలు తాగే హక్కును పొందటట్లు చూడాలని వివరించారు. ఈ తల్లిపాల వారోత్సవాలు నేటి నుండి వారం రోజుల వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐ సి డి ఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది సమన్వయంతో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రజలు తప్పనిసరిగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకొని బిడ్డకు ముర్రుపాలు అందిటట్లు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, సికెఎం హాస్పిటల్ సూపరిండెంట్, ఆర్ఎంఓ డాక్టర్ మురళి ,డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రకాష్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ అర్చన, సంబంధిత సిబ్బంది గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు మొదలగువారు పాల్గొన్నారు.