calender_icon.png 2 August, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో మానుకోట విద్యార్థుల సత్తా

01-08-2025 12:26:20 AM

అండర్ విభాగంలో బంగారు పతకాలు

మహబూబాబాద్, జూలై 31 (విజయక్రాంతి): జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో మానుకోట విద్యార్థులు సత్తా చాటారు. ఆంధ్రపద్రేశ్‌లోని విజయవాడలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సంయుక్తంగా ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించాయి.

ఈ పోటీల్లో మహబూబాబాద్ జిల్లా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. అండర్ 14 విభాగంలో తెలంగాణ తరఫున పాల్గొన్న ఎస్‌కే సదాఖత్ అలీ, పీ తనిష్క్ తేజ్, పీ కనిష్క్ తేజ్ అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ జీ శ్రీనివాస్‌రావు, పీఈటీ నసీరుద్దీన్ అభినందించారు. విద్యార్థులు జీవితంలో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.