calender_icon.png 14 October, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాఖలో ఏఐ హబ్.. గూగుల్ సీఈవో పోస్టు

14-10-2025 03:31:47 PM

న్యూఢిల్లీ: విశాఖపట్నంలో ఏఐ హబ్ ఏర్పాటుపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎక్స్ లో పోస్టు చేశారు. విశాఖపట్నంలో మొట్టమొదటి గూగుల్ ఏఐ హబ్ కోసం తమ ప్రణాళికలను పంచుకోవడానికి, ఇది ఒక మైలురాయి అన్నారు. 15 బిలియన్ డాలర్లతో విశాఖలో ఏఐ హబ్, గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సముద్రగర్భంలో కేబులింగ్ ఏర్పాటు చేస్తున్నామని, భారీ ఎత్తున విద్యుత్ మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని పిచాయి తెలిపారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభుత్వంతో గూగుల్ చారిత్మ్రాక ఒప్పందం చేసుంది. 

ఈ హబ్ గిగావాట్-స్కేల్ కంప్యూట్ సామర్థ్యం, ​​కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, పెద్దస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను మిళితం చేస్తుంది. దీని ద్వారా మేము మా పరిశ్రమ-ప్రముఖ సాంకేతికతను భారతదేశంలోని సంస్థలు, వినియోగదారులకు తీసుకువస్తామన్నారు. ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేసి దేశవ్యాప్తంగా వృద్ధిని పెంచుతామని సుందర్ పిచాయి వెల్లడించారు. 

భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో విశాఖపట్నంలో నూతనంగా 1 గిగావాట్ సామర్థ్యం గల  ఏఐ హబ్‌ ఏర్పాటుకు  ఎంవోయూ సంబంధించింది. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య చర్చలు  జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్) పాల్గొన్నారు.