20-11-2025 10:16:38 PM
జిన్నారం: బొల్లారం పట్టణం లక్ష్మినగర్ లో ఒరిస్సాకు చెందిన అజయ్ కుమార్ దాస్ తండ్రి ఆనంద్ కుమార్ దాస్(50) గత 20 సంవత్సరాల నుండి బొల్లారంలో నివాసం ఉంటూ పాన్ షాప్ నడుపుతూ గత కొంత కాలంగా ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయి చాక్లేట్స్ తెచ్చి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు అమ్ముతున్నడనే సమాచారం మేరకు అతడి పాన్ షాప్ పై చెకింగ్ నిర్వహించగా సుమారు 238 గంజాయి చాక్లెట్స్ 1270/- లభించినవి అట్టి వాటిని క్లూస్ టీం సహాయంతో సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.