calender_icon.png 20 November, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత

20-11-2025 10:14:30 PM

నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతర లబ్ధిదారులలో అధికారులు ఎంపిక చేసిన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఈరోజు అందజేశారు.​ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు  మందుల సామేల్ హాజరయ్యారు. ఆయనతో పాటు నూతనకల్ ఎంపీడీఓ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. 

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన సందర్భంగా, వెంకేపల్లి గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సామేల్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో నూతనకల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు పాల్వాయి నాగరాజు, వెంకేపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ సుదీర్ రెడ్డి పాల్గొన్నారు.​వీరితో పాటు, పాల్వాయి రవి, దూదిగాం అంజయ్య, తోనుకునూరి వెంకన్న, గంగాధరి శ్రీను, పాల్వాయి నాగార్జున్, గంగాధరి పరశురాం, నాగరాజు, పాల్వాయి శ్రీను, పాల్వాయి వీరాస్వామి, పాల్వాయి రాజ్ కుమార్, దిలీప్, మధు, రాకేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.