22-11-2025 04:28:54 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతోనే మహిళా సంక్షేమం సాగుతుందని గత ప్రభుత్వాలు మహిళలను ఏమాత్రం పట్టించుకోకపోగా వారిని మభ్యపెట్టి ఓట్ల కోసం వాడుకున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో తరుణి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అని అన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు పడిగల భూషణ్, అబ్దుల్ మాజీద్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి, జెడ్పి సీఈవో గోవింద్, తాసిల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీఓ సి హెచ్ రత్నాకర్ రావు, తదితరులు ఉన్నారు.