calender_icon.png 22 November, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఇజ్జగిరి దేవేందర్ ప్రజాపతి ఎన్నిక

22-11-2025 04:18:34 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా శాలివాహన కుమ్మరి సంఘం నూతన అధ్యక్షుడిగా కమలాపూర్ మండలం దేశరాజుపల్లికి చెందిన ఇజ్జగిరి దేవేందర్ ప్రజాపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. దేవేందర్ ప్రజాపతి కుమ్మరి సమాజ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజాపతి తెలిపారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇజ్జగిరి దేవేందర్ ప్రజాపతి మాట్లాడుతూ... తనపై నమ్మకంతో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి, రాష్ట్ర గౌరవ సలహాదారులు, తొలి రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస ప్రజాపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉరిటి వెంకట్రావు ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి లెలిజాల పావని ప్రజాపతులకు, నాయకులకు, కుల బాంధవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.