calender_icon.png 22 November, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమనామస్మరణంతో మారు మోగిన తుమ్మలపల్లి

22-11-2025 04:16:09 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం  తుమ్మనపల్లి  గ్రామంలో శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ధ్వజస్తంభ, శిఖర యంత్ర ప్రతిష్ట, శాంతి కళ్యాణంలో భాగంగా శనివారం గ్రామం మొత్తం హనుమాన్ నామస్మరణతో మరుమోగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్య పర్యవేక్షణలో వేద పండితులు చెరుకుపల్లి నిఖిలాచార్య, సుజిత్ కుమార్ ఆచార్యులు, గోపాలకృష్ణమాచార్యులు వేద మంత్రోచ్ఛరణల మధ్య కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రెండవ రోజు శనివారం ఉదయం నుంచే ఆధ్యాత్మిక క్రతువులు మొదలయ్యాయి. పండితుల ఆధ్వర్యంలో గోపూజతో కార్యక్రమం ప్రారంభమై, యాగశాల ప్రవేశం ద్వారా తోరణా ధ్వజ కుంభ పూజ, అగ్ని ప్రతిష్టాపన వంటి ప్రధాన క్రతువులను  శాస్త్రోత్తంగా  నిర్వహించారు. మూలమంత్రమూర్తి మంత్ర హోమం మన్యుహస్త హోమం వంటి పవిత్ర హోమాలను ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం శిఖరానికి పంచాంగవ్యంతో ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుమారస్వామి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సింగిల్ విండో చైర్మన్లు, తోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.