శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించిన చంద్రుడు..!
06-03-2026 06:47 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సాంబశివ దేవాలయం ఆవరణంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు , కాగా పున్నమి చంద్రుడు నిండు కుండాల ఉండి మబ్బుల చాటు నుంచి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాటుగా కనిపించాడు. దీంతో భక్తులు శివపార్వతులతోపాటు చంద్రుడికి కూడా దండం పెట్టుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ దృశ్యం అర్చకులు, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.




