భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి
విశ్వజన కళా మండలి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మాస్టార్ జి
నిర్మల్,(విజయక్రాంతి): జై భీమ్ సేన, మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలుగు ఉమ్మడి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశములలో చేర్చాలని డిమాండ్ తో దేశవ్యాప్తంగా 5 లక్షల కిలోమీటర్లు భారతదేశ రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్రలో భాగంగా శుక్రవారం రోజు నిర్మల్ కు చేరుకున్నారు.
భారత రాజ్యాంగ రథయాత్ర నాయకులకు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు మెమోరాండం సమర్పించడం జరిగింది. టీఎన్జీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాస్టర్ జి మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో సబ్జెక్టులుగా చేర్చాలని అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో రథయాత్ర ద్వారా ప్రయాణిస్తూ కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామనీ అన్నారు.
అనంతరము గోడ ప్రతులను కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్, జాతీయ కమిటీ సలహాదారులు మిడనల నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సలహాదారులు ఎర్ర అలెగ్జాండర్ ప్రభు, రాష్ట్ర కమిటీ మహిళా అధ్యక్షురాలు ఆవుల ఎస్తేరు రాణి, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఈ పురుషోత్తం లు తదితరులు పాల్గొన్నారు.




