02-12-2025 03:41:51 PM
కొనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి కాలకోట భాగ్య చంద్రయ్య కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి 15 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం చేరారు. వారికి మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సీనియర్ నాయకులు రాఘవరెడ్డిలో కండువా కప్పి ఆహ్వానించారు. వారి వెంట గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు అరె మహేందర్ తదితరులు ఉన్నారు.