calender_icon.png 2 December, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ భద్రతపై విద్యాసంస్థలు.. పని ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

02-12-2025 03:38:22 PM

జిల్లా షీ టీమ్

సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచనల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతిరోజూ విద్యాసంస్థలు, మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్ / బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, షీ టీమ్ సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గత నెలలో జిల్లాలో వేధింపులకు పాల్పడిన వారిపై 2 FIR's,02 పెట్టి కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించి, వేధింపులకు గురైతే  నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.