30-09-2025 05:44:03 PM
మంథని (విజయక్రాంతి): దేవినవరాత్రుల ఉత్సవాల సందర్బంగా మంగళవారం ఓదెల మండలం పిట్టలఎల్లయ్యపల్లి, ఓదెల గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండల వద్ద అమ్మవారికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.