03-09-2025 10:58:30 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత సామూహిక వివాహ మహోత్సవ పోస్టర్ ను సభ్యులు విడుదల చేశారు. అక్టోబర్ 26న జరుపనున్న సామూహిక వివాహ మహోత్సవంలో ఆసక్తి కలిగిన జంటలు పాల్గొనాలని కోరారు. సామూహిక వివాహాలలో పాల్గొనేవారు అక్టోబర్ 1న రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు బెల్లంపల్లి తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను సంప్రదించాలన్నారు.