03-09-2025 10:56:07 PM
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని లేమూర్ శివార్ లోని దొమ్మరి వాగుపై గల తాత్కాలిక వంతెన ఇటీవుల కురిసిన వర్షాలతో తెగిపోవడంతో వెంకటాపుర్ గ్రామం నుండి లేమూర్ పంట పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధర్మసమాజ్ పార్టీ యువ నాయకుడు రామగిరి మహేందర్ తెలిపారు. బుధవారం ఆయన గ్రామ రైతులతో కలిసి వాగును పరిశీలించి మాట్లాడారు. అధిక వర్షాలతో గత 15 రోజుల క్రితం వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రైతులు వాగు దాటాలంటే ఇబ్బంది కరంగా మారిందన్నారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇదే సమస్యను రైతులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. లేమూరు శివారులో సుమారు 12 వందల ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారని, వెంకటాపుర్ తో పాటు పొన్నారం,ఆదిల్ పేట్, చిర్రకుంట తదిత గ్రామాలకు చెందిన రైతులకు లేమురు శివారులో భూములు న్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, ప్రస్తుత తాత్కాలిక వంతెన నిర్మించి, అనంతరం సమస్య పరిష్కారానికి శాశ్వత వంతెన ను వెంటనే నిర్మించాలని కోరారు.