3 May, 2026 | 3:22 PM

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

26-06-2024 12:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవిం చింది. రోడ్ నంబర్ జర్నలిస్ట్ కాలనీ బస్‌స్టాప్ ఎదురుగా ఉన్న భవనంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ మం టలతో ఆ ప్రాంతమంగా దట్టమైన పొగలు కమ్ముకుంది.  అందులో పనిచే సే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటల కారణంగా ఫర్నిచర్, తదితర సామగ్రి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకు న్న జూబ్లీహిల్స్, ఫిలింనగర్ అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా, బిల్డింగ్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ప్లేస్‌ను డంపింగ్ కోసం వాడటం వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం.