యువతి కడుపులో భారీ కణితి
విజయవంతంగా తొలగించిన ‘మెడికవర్’ వైద్యులు
చందానగర్, మే 8(విజయక్రాంతి): ఓ యువతికి రోజురోజుకూ పెరుగుతున్న పొట్ట.. భరించలేని కడుపునొప్పి.. గర్భిణిలా మారిన శరీరాకృతి... చివరకు పరీక్షలు చేయించుకోగా ఫుట్‌బాల్ సైజ్‌లో ఉన్న భారీ అండాశయ కణితి వైద్య పరీక్షల్లో బ యటపడింది. ప్రాణాలకు ముప్పుగా మారి న ఈ క్లిష్ట పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి 35 ఏళ్ల ఆ యువతికి (బోడపట్ల గ్రా మం దౌతాబాద్ సంగారెడ్డి జిల్లా) కొత్త జీవి తం అందించారు.
టి. సంధ్య అనే యువతి రెండు వారాలుగా తీవ్రమైన కడుపునొప్పి, పొట్ట బరువుగా ఉండటం, క్రమంగా పొట్ట అసాధారణంగా పెరగడం వంటి సమస్యలతో బాధపడుతోంది. మొదట సాధారణ గ్యాస్ లేదా జీర్ణకోశ సమస్య అనుకుని స్థానికంగా చికిత్స తీసుకుంది. అయితే నొప్పి రోజురోజుకూ పెరగడంతో పాటు పొట్ట గర్భిణిలా కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిలో సంధ్య డాక్టర్ జి. భవ్య సీనియర్ ప్ర సూతి వైద్యురాలు, గైనకా లజిస్ట్ లాప్రోస్కోపిక్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్‌లో సంప్రదించింది. రోగిని పరీక్షించిన వైద్యులు ఆమె ఉదర భాగమంతా ఆక్రమించిన భారీ సిస్టిక్ మాస్ ను గుర్తించారు.
స్కానింగ్‌లో కుడి అండాశయం నుంచి ఉ ద్భవించిన సుమారు 14.1 x 20.3 x 19.5 సెం.మీ పరిమాణంలో భారీ ఓవేరియన్ సిస్ట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కణితి ఫుట్‌బాల్ పరిమాణంలో ఉండ టం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కణితి భారీ పరిమాణం, క్లిష్టత దృష్ట్యా గైనకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, అనస్థీషియా నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం శస్త్రచికిత్సకు ప్రణాళిక రూ పొందించింది. డాక్టర్ జి.భవ్య ఆధ్వర్యంలో, డాక్టర్ ఎస్. రఘు రామిరెడ్డి సహకా రంతో వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించి ఈభారీ కణితిని వైద్యు లు ఎలాంటి రప్చర్ కాకుండా పూర్తిగా తొలగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జి. భవ్య మాట్లాడుతూ రోగి మావద్దకు వచ్చే సమయానికి కణితి దాదాపు మొత్తం ఉదర భాగా న్ని ఆక్రమించింది. మరికొంత ఆలస్యం జరిగి ఉంటే ప్రా ణాపాయం ఏర్పడే అవకా శం ఉండేది. సరైన సమయంలో ఆసుపత్రికి రావడం వల్లే ఈ యువతి ప్రాణాలను కాపాడగలిగాం అని తెలిపారు.ఆరోగ్యంగా కోలు కున్న సంధ్య భావోద్వేగంతో మాట్లాడుతూ: నా పొట్ట గర్భిణిలా పెరగడంతో చాలా భయపడ్డాను. నొప్పి కూడా తట్టుకోలేని స్థాయిలో ఉండేది. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ మెడికవర్ వైద్యులు నా కు ధైర్యం చెప్పారు. ఇప్పుడు మళ్లీ కొత్త జీవి తం దక్కినట్లుంది అని తెలిపింది.






