calender_icon.png 1 November, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ సీజన్

01-11-2025 12:43:22 AM

విజయవంతంగా నిర్వహించిన ‘నారాయణ’ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ సీజన్ 6 కార్యక్రమాన్ని నారాయణ స్కూల్స్ విజయవంతంగా నిర్వహించింది. గత 6 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ పోటీ, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నారాయణ స్కూల్స్ నిర్వహించబడుతూ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిష్టా త్మక కార్యక్రమంగా ఎదిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నారాయణ క్యాంపస్‌లో 100 శాతం పాల్గొనడం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల ఉత్సాహం, అంకితభావం ప్రతిబింబించాయి. ఈ మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబడింది. ప్రస్తు తం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కొనసాగుతోంది. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులు ‘నేను జంతువులతో మాట్లాడగలిగితే, నేను సూపర్ హీరో అయితే, ప్రపంచంలో నేను మార్చాలనుకునే ఒక విషయం’ వంటి సృజనాత్మకమైన, ఆలోచనాత్మక అంశాలపై ప్రసంగించారు.

8, 9వ తరగతి విద్యార్థులు సంయుక్త రాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆధారంగా గుణాత్మక విద్య, లింగ సమానత్వం, ఆరోగ్యం, శ్రేయస్సు, శుద్ధ జలము, పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ వంటి సామాజిక, గ్లోబల్ అంశాలపై ప్రసంగించారు. ఈ పోటీ ద్వారా విద్యార్థులు తమ ఉచ్ఛారణ, స్వర నియంత్రణ, శరీర భాష, ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకున్నారు. ప్రతి విద్యార్థిని శరీర భాష, భాషా ప్రావీణ్యం, స్వర మాడ్యులేషన్, కంటెంట్ నాణ్యత, సృజనాత్మకత, సమయపాలన ఆధారంగా పోటీలో మార్కులను వేశారు.

విజేతలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు ప్రదానం చేసి వారి ప్రతిభను గౌరవించారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డా. పీ.సింధూర నారాయణ మాట్లాడు తూ.. నారాయణ స్కూల్‌లో ప్రతి విద్యార్థి తన స్వరాన్ని కనుగొని, దానిని అర్థవంతం గా వినిపించే ధైర్యాన్ని పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నారాయణ విద్యాసం స్థల డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ.. కేవలం చదువు ఒక్కటే కాదు, విద్యా ర్థి సమగ్రాభివృద్ధి కోసం అన్నిరకాల కార్యక్రమాలు చదువులో భాగంగా అందించటం నారాయణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.