calender_icon.png 1 November, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలి

01-11-2025 12:40:56 AM

అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

మునిపల్లి, అక్టోబర్ 31 : పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ సీసీఐ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మునిపల్లి మండలం మేళాసంగం గ్రామ శివారులో గల మంగళ్ మూర్తి  కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.

రైతులకు కనీస మద్దతు ధరను కల్పించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. అలాగే దళారులను నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రైతులకు సూచించారు. ఈ కేంద్రం ద్వారా సదాశివపేట, రాయికోడ్, నారాయణఖేడ్, జోగిపేట, వట్పల్లి మండలాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పత్తి రైతులు కనీస మద్దతు ధర కోసం కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ను డౌన్ లోన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

ఈసందర్భంగా గత వర్షాకాలం (2024-25) లో 3 లక్షల 80 వేల క్వి0టాళ్ల పత్తిని కోనుగోలు చేసి రైతులకు రూ. 280 కోట్ల రూపాయలను చెల్లించామని సీసీఐ అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం రైతులకు జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణి చేశారు ఈ కార్యక్రమం లో సీసీఐ  కమర్షియల్ ఆఫీసర్ వరుణ్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి పెద్దచెల్మెడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పద్మ దుర్గయ్య, సొసైటీ కార్యదర్శి శివారెడ్డి తదితరులు ఉన్నారు.