calender_icon.png 7 August, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ డ్రైవ్ లో మాస్టర్ మైండ్ పాఠశాల బస్సు సీజ్

06-08-2025 11:41:43 PM

మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ డ్రైవర్ పరుశురాం..

గజ్వేల్: జగదేవపూర్ మండలం దౌలాపూర్ సమీపంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాస్టర్ మైండ్ పాఠశాల(The Masterminds School) బస్సు డ్రైవర్ పరుశురాం మద్యం సేవించినట్లుగా గుర్తించినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో జగదేవపూర్ కు చెందిన మాస్టర్ మైండ్స్ పాఠశాల బస్సు వస్తున్న క్రమంలో పోలీసులు డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. బస్సు నడుపుతున్న పరుశరాములుకు డ్రంకెన్ టెస్ట్ లో 216 మిల్లీ గ్రాములు రావడంతో, కేసు నమోదు చేసి బస్సు సీజ్ చేసినట్టు తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సుమారు 40 మంది పిల్లలు బస్సులో ఉన్నారని ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.