calender_icon.png 7 August, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

07-08-2025 05:21:53 PM

నిర్మల్ (విజయక్రాంతి): మామడ మండలం కమల్ కోట్ గ్రామంలో రూ.5 లక్షలతో యాదవ సంఘ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) గురువారం భూమి పూజ చేసారు. అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. తిరుమల్ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు విచ్చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మండల నాయకులు బాపు రెడ్డి , రాజారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జాలం సింగ్, రమణ,సూరి, తో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.