07-08-2025 05:20:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Aam Aadmi Party District Convener Syed Haider) ఆరోపించారు. గురువారం నిర్మల్ లో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ ధర్నా కాదని అది కాంగ్రెస్ పార్టీ ధర్నా అని ఎద్దేవా చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయాల్లో కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు కారుస్తున్నాయని ఆరోపించారు. బీసీలపై ఏమాత్రం గౌరవమున్న రాష్ట్ర మంత్రివర్గంలో జనాభా ప్రతిపదికన బీసీలకు అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల నినాదంపై రెండు పార్టీలు పరస్పర విమర్శ చేసుకోవడం ప్రజలు గుర్తిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గుణపాఠం చెప్తారని విస్తరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు