calender_icon.png 7 August, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వనమహోత్సవం

07-08-2025 05:09:00 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy) పిహెచ్సి ఆవరణలో గ్రామపంచాయతీ సిబ్బంది, పీహెచ్ సి సిబ్బంది, ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కందుల నాగరాజు, బిల్ కలెక్టర్ బాబు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.