07-08-2025 05:18:33 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా నియమితులైన మనోజ్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. 2003 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి మనోజ్ సంగారెడ్డిలో ట్రైనీ కలెక్టర్గా పనిచేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా కొనిజల్ల మండలం అనంతరాం గ్రామంలో ఇనుకొండ ఈశ్వర సత్యసాయి దుర్గ మనోజ్ 1999లో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. తల్లి గంగా భవాని గృహిణి కాగా అప్పటి ఉమ్మడి జిల్లా (మంచిర్యాల జిల్లా) తాండూరు మండలంలో సీఐగా వెంకటేశ్వర్లు పని చేశారు. దీంతో మనోజ్ విద్యాభ్యాసం విద్య భారతి పాఠశాలలో చేశాడు.
4,5 తరగతుల వరకు ఇక్కడే చదువుకున్నాడు. 2019లో వరంగల్ నెట్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఐఏఎస్ కావాలని చిరకాల వాంఛతో ఆయన 2022 ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. అంతకుముందు ఐ ఆర్ఎస్ కు ఆయన ట్రైనింగ్ చేస్తున్న క్రమంలోనే 2022 ఐ ఏ ఎస్ కు ఎంపీ అయ్యాడు. అనుకున్నట్లుగానే ఐఏఎస్ ను సాధించాడు. లాల్ బహుదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రైనింగ్ చేశాడు. 2024 నుంచి 25 వరకు మసూర్ లో శిక్షణ పూర్తి చేసి 2025 లో సంగారెడ్డి ట్రైన్ కలెక్టర్గా పని చేశారు. అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్గా పూర్తిస్థాయి బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చలందించి స్వాగతం పలికారు.