calender_icon.png 7 August, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పద్మ అవార్డు గ్రహీత పారుపల్లి నరసింహను సన్మానించిన కలెక్టర్ హనుమంతరావు

07-08-2025 05:10:44 PM

వలిగొండ (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో గురువారం జాతీయ చేనేత దినోత్సవం జౌళి శాఖ సంచాలకులు ఏడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత అభివృద్ధికి పాటుపడిన జాతీయ పద్మ అవార్డు గ్రహీత, జాతీయ మహాకవి నన్నయ్య అవార్డు గ్రహీత పారుపల్లి నరసింహను జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) శాలువాతో సన్మానించి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, చేనేత అభివృద్ధి ఎంతో అద్భుతమైనదని ప్రతి ఒక్కరు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు.