calender_icon.png 7 August, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా చెరువు కట్టను చీల్చి తన సొంత పొలముకు దారి..

07-08-2025 05:15:41 PM

ఇరిగేషన్, మండల అధికారులు చర్యలు తీసుకోవాలి..

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలోని చెరువు కట్టను చీల్చి తన సొంత పొలముకు దారి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దీనిపై గ్రామంలోని పెద్దలు కుమ్మరి నర్సింలుకు చెరువు కట్టను చీల్చవద్దని గ్రామస్తులు తెలిపిన పెడచెవిన పెడుతున్నాడని గ్రామ యువ నాయకుడు కుతాడి నరసింహులు ఆరోపించారు. ఇదే విషయాన్ని గ్రామ పెద్దలు చెప్పిన వినకుండా ఎవరేం చేసినా భయపడేది లేదని ఇరిగేషన్, మండల అధికారుల నుండి అనుమతులు తీసుకున్నానని సమాధానమిస్తున్నాడని గ్రామంలోని సాంఘిక సేవ కర్త కుతాడి నరసింహులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

చెరువు క్రింది భాగంలో గ్రామస్తులందరికీ పొలాలు ఉన్నాయని ఈ వ్యక్తి మాత్రం చెరువు కట్టను చెడగొట్టి తన పొలమునకు ఇరువైపులా దారి చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నాడు. భారీ వర్షాలకు కట్టకాస్త సన్నగిల్లి తెగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని, తక్షణమే మండల అధికారులు, ఇరిగేషన్ అధికారులు కల్పించుకొని కట్టను చీల్చిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు, లేనిపక్షంలో ప్రతి ఒక్కరు పెద్ద చెరువు కట్టను చీల్చే ప్రయత్నం చేస్తారని దీని ద్వారా చెరువు కట్టకు ప్రమాదం ఏర్పడుతుందని వారు వివరించారు.