calender_icon.png 5 January, 2026 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక సాంకేతిక మూలం గణితం: ప్రొఫెసర్ కుమారేశన్

03-01-2026 07:13:05 PM

హనుమకొండ,(విజయ క్రాంతి): సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ఎంటీటీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కుమారేశన్ ప్రత్యేక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గణితశాస్త్ర ప్రాథమిక భావనలు, వాటి ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక రంగాల్లో గణిత అనువర్తనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల ప్రశ్నలకు సులభమైన ఉదాహరణలతో సమాధానాలు చెబుతూ గణితంపై ఆసక్తి పెంపొందించేలా ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో గణిత విభాగాధిపతి డా.టీ. నాగయ్యతో పాటు అధ్యాపకులు డా. అంజన్ రావు, డా. రవికుమార్,డా. శ్రీలక్ష్మి, డా.మంజుల పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రొఫెసర్ కుమారేశన్‌ ను కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి సన్మానించారు.