calender_icon.png 5 January, 2026 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేత

03-01-2026 07:09:40 PM

మునుగోడు,(విజయాక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సౌజన్యంతో మంజూరైన ఒక లక్ష యాభై వేలు రూపాయల ఎల్ఓసి పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ జాజుల స్వామి గౌడ్ మాట్లాడుతూ... జమస్థాన్ పల్లి గ్రామానికి చెందిన జినుకల రామకృష్ణ అనే వ్యక్తి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతనికి మెరుగైన చికిత్స అవసరం ఉన్నదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఎల్ వోసి ని మంజూరు చేయించారన్నారు. త్వరితగతిన ఎల్ఓసిని మంజూరు చేయించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.