calender_icon.png 5 September, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సాపూర్ నియోజకవర్గ గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ కానుక

03-09-2025 10:39:49 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండల కేంద్రంలోని అంగన్వాడి  కేంద్రాలలో, నమోదయి ఉన్న గర్భిణీ స్త్రీలకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మాతృదేవోభవ కానుక కింద ప్రోటీన్ పౌడర్, ఐరన్ సిరప్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అనంతరం ప్రోటీన్ వలన కలిగే లాభాల గురించి తెలిపారు. ప్రోటీన్ రక్త పరిమాణం పెరగడానికి, కణజాలాల పెరుగుదలకు, ఆరోగ్యకరమైన గర్భధారణకు ప్రోటీన్ చాలా అవసరమని, శిశువు కణజాలాల పెరుగుదల, రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి ప్రోటీన్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమం నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, పంపిణీ చేయడం జరుగుతుందని, మిగతా గ్రామాలకు రేపటినుండి స్థానిక అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీనికి ఎలాంటి రాజకీయం సంబంధం లేదని  నా సొంత డబ్బు ద్వారానే వీటిని పంపిణీ చేస్తున్నానని, దయచేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ వీటిని క్రమం తప్పకుండా వాడాలని  ఆయన అన్నారు.