calender_icon.png 5 September, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిస్థాపన వైపు మణిపూర్ అడుగులు

05-09-2025 01:05:13 AM

-ఎన్‌హెచ్ రీఓపెన్ 

-కేంద్రం ప్రభుత్వం మధ్యకుదిరిన త్రైపాక్షిక ఒప్పందం 

-సెప్టెంబర్ రెండో వారంలో ప్రధాని మోదీ పర్యటన!

ఇంఫాల్, సెప్టెంబర్ 4: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శాంతి స్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా మణిపూర్‌లో ఉన్న జాతీయ రహదారిఫి (ఎన్‌హెచ్ తిరిగి ప్రారం భించేందుకు కేంద్రం జో కౌన్సిల్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. సెప్టెంబర్ రెండో వారంలో ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటిస్తారని చర్చ జరుగుతున్న వేళ ఎన్‌హెచ్ రీ ఓపెనింగ్‌కు ఒప్పందం కుదర డం ప్రాధాన్యత సంతరించుకుంది.

2023 మేలో అల్లర్లు మొదలైన తర్వాత నుంచి ప్రధాని మోదీ అక్కడ పర్యటించలేదు. ఒకవేళ ఇప్పుడు అక్కడికి వెళ్తే అల్లర్ల తర్వాత ఇదే తొలి పర్యటన కానుంది. దేశరాజధాని ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఎన్‌హెచ్ అస్సాంలో మొదలై మణిపూర్ మీదుగా వెళ్తుంది.

ఈ రహదారి గుండా ప్రయాణికులు, నిత్యావసర వాహనాలను ఎ టువంటి ప్రతిబంధకాలు లేకుండా అనుమతించనున్నారు. ఈ కీలక మార్గంలో మర లా శాంతిని పునరుద్ధరించేందుకు సహకరిస్తామని కుకీ కౌన్సిల్ (కేజెడ్‌సీ) తెలిపిం ది. హోంమంత్రిత్వ శాఖ అధికారులు, కేజెడ్‌సీ ప్రతినిధుల మధ్య అనేక దఫాలుగా జరి గిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. 

అల్లర్లకు కారణమిదే.. 

మే 2023 నుంచి మణిపూర్ మండుతూ నే ఉంది. అక్కడ మెజారిటీగా ఉన్న మెయిటీ తెగకు షెడ్యూల్ ట్రైబ్ హోదాను కల్పించే అంశాన్ని పరిశీలించాలని మణిపూర్ హైకో ర్టు అప్పటి బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కొండ ప్రాంతాల్లోని గిరిజన తెగలు వ్యతిరేకించాయి. దీంతో మణిపూర్ రావణకాష్టంలా మారింది.

ఆనా టి నుంచి జరుగుతున్న హింసలో భద్రతా సిబ్బందితో సహ కుకీ, మెయిటీ వర్గాలకు చెందిన దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత మణిపూర్‌లో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. త్రైపాక్షిక ఒప్పందం (ఎస్‌వోవో)ను ఈ రోజు సవరించారు.

ఒప్పందంలో భాగంగా కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ రెండు సంస్థలు అల్లర్లు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉన్న తమ ఏడు స్థావరాలను తరలించేందుకు అంగీకారం తెలిపాయి. ఈ చర్యల ద్వారా ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న శిబిరాల సంఖ్య ను తగ్గించేందుకు కూడా ఈ ఒప్పందం ద్వారా ప్రయత్నిస్తున్నారు.

శిబిరాల్లో ఉన్న ఆయుధాలను సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ క్యాంపుల్లో అప్పగించేలా ఈ ఒప్పందంలో ఉంది. ఇటువంటి చర్యల ద్వారా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేలా ప్రతిపాదనలు చేశారు. భద్రతా దళాలు క్యా డర్లకు కఠిన భౌతిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఎవరరైనా విదేశీ పౌరులు ఉంటే వా రిని జాబితాల నుంచి తొలగించనున్నారు.