27 August, 2026 | 2:04 AM

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

27-08-2026 12:00 AM

ఏఎంసీ చైర్మన్ వేణారెడ్డి

సూర్యాపేట, ఆగస్టు 26 (విజయక్రాంతి) : అమ్మవారి ఆశీస్సులతో ప్రజలం తా సుఖసంతోషాలతో, ఆ యురారోగ్యాలతో ఉండాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం 5వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన సతీసమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరికీ శాంతి, సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. దేవాలయాల్లో నిర్వహించే పూజలు, వార్షికోత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ మహేష్, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయ అధ్యక్షుడు ఉప్పల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మిర్యాల కొండలరావు, కోశాధికారి ముప్పారపు బాబురావు, ఉపాధ్యక్షులు పివి సాగర్, చర్ల సత్యనారాయణ కందిమల్ల సత్యనారాయణ, అర్షకులు చంద్రశేఖర్ శర్మ, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.