విద్యార్థుల సంక్షేమానికి అన్ని విధాలా సహకరిస్తాం
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట, ఆగస్టు 26 (విజయక్రాంతి) : విద్యార్థుల సంక్షేమానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కేజీబీవీ చివ్వెంల పాఠశాలకు రూ.30 వేల విలువైన మోటార్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వి ద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని అన్నారు.
పాఠశాల అవసరాలను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైన మేరకు సహకారం అందిస్తానని తెలి పారు. త్వరలో పాఠశాలలోని ల్యాబ్లకు అవసరమైన మెటీరియల్ను కూడా అందిస్తానని హామీ ఇచ్చారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని కో రారు. విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపడితే వారు విద్యలో మరింత రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి సి డి ఓ పులన్, కాంగ్రెస్ నాయకులు పిల్లల రమేష్ నాయుడు, గోపాల్ రెడ్డి, అరవింద్ రెడ్డి, యాట ఉపేందర్, తండు శ్రీనివాస్, మర్ల కరుణాకర్ రెడ్డి, ధర్మానాయక్, పాఠశాల స్టాప్ జి దుర్గా డి సుజాత, తదితరులు పాల్గొన్నారు.






